ముగించు

ఆర్.ఓ.ఎఫ్.ఆర్ రైతు బంధు చెక్ పంపిణి 18/05/2018 నుండి

ప్రచురణ తేది : 15/06/2018

దేశంలో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి రైతు బంధు కార్యక్రమం / పెట్టుబడి మద్దతు పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి గిరిజన రైతు అరణ్యంలో భూమి పండించడం మరియు ఫారెస్ట్ రైట్స్ (ఆర్ ఓ యఫ్ ఆర్) డాక్యుమెంట్ కలిగివున్న ప్రతి ఖరీఫ్ మరియు రబీ సీజన్స్ కు ఒక్కొక్క ఎకరానికి 4000 రూపాయలు. భూమి యొక్క విస్తీర్ణం ప్రకారం, రైతు అంత మొత్తములో సహాయాన్ని పొందుతాడు. చెక్కులను ముద్రించి, రైతులకు పంపిణీ చేశారు. ఖాతాలో భద్రపరచకుండా తక్షణమే నియమిత బ్యాంకు యొక్క ఏదయినా శాఖలో డిపాజిట్ చేయడం ద్వారా మొత్తం రైతుకు నేరుగా చెల్లించబడుతుండడం ఈ పధకం యొక్క ప్రత్యేకత.