ముగించు

చరిత్ర

జిల్లా లోని ప్రధాన పట్టణమయిన ఆదిలాబాద్ నే జిల్లా పేరుగా పొందుపర్చడమయినది. బీజాపూర్ ను పాలించిన అలీ ఆదిల్ షా పేరే ప్రధాన పట్టాణానికి పెట్టడం జరిగింది.  చాలా కాలం వరకు ఈ జిల్లా ఎకీకృతముగా లేదు. జిల్లా లోని వివిధ భాగములు వివిధ కాలములందు అనేక రాజ వంశీయుల ద్వారా అనగా సిర్పూర్ కు చెందిన గోండు రాజులు, చాందా కు చెందిన రాజులే కాకుండా  మౌర్యులు, శాతవాహనులు, వాకాటకులు, బాదామి యొక్క చాలుడ్యులు,  రాష్ట్రకూటులు,  కల్యాణి – చాళుక్యులు, మొఘలులు, నాగపూర్ కు చెందిన భోసలేలు మరియు అసఫ్ జాహీల ద్వారా పాలించబడ్డాయి.  వాస్తవానికి ఇది పూర్తి స్థాయి జిల్లా కాదు.  క్రీ.శ. 1872  లో ఎదలాబాద్(ఆదిలాబాద్),రాజురా,సిర్పూర్ తాలూకాలతో రూపొందించిన సిర్పూర్-తాండూర్ పేరు కల ఉప జిల్లా.  1905 వ సంవత్సరములో ఈ ఉప జిల్లాను ఆదిలాబాద్ ప్రధాన పట్టణముగా స్వతంత్ర పూర్తి జిల్లా గా  చేసారు. తదుపరి  2016  వ సంవత్సరములో ఆదిలాబాద్ జిల్లాను 4 జిల్లాలుగా అనగా ఆదిలాబాద్,మంచిర్యాల్,నిర్మల్,కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా పునర్వ్యవస్తీకరించారు.