ముగించు

రైతుబందు చెక్కులు మరియు పాస్ పుస్తకాల పంపిణి 10/05/2018 నుండి

ప్రచురణ తేది : 18/05/2018

తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ రికార్డ్స్ నవీకరణ కార్యక్రమం మిషన్ మోడ్లో నిర్వహించింది. భూమి రికార్డులను సవరించిన తరువాత 18 సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన కొత్త పట్టాదార్ పుస్తకములు, లైంగిక, సాంఘిక స్థితి, ఫోటో వివరాలతో పాటు భూమి వివరాలు, రైతు, తహసిల్దార్ల సంతకాలు ముద్రించినవి రైతులకు, ఒక వారంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు పంపిణీ చేయబడుతున్నాయి. ప్రతి గ్రామంలోని పండుగ వాతావరణములో ప్రముఖ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పాల్గొని పట్టదార్ పాస్ పుస్తకములు అసలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

దేశంలో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి రైతు బంధు కార్యక్రమం / పెట్టుబడి మద్దతు పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఖరీఫ్ మరియు రబీ సీజన్స్ కోసం ఒక్కొక్క ఎకరానికి 4000 రూపాయలు. భూమి యొక్క విస్తీర్ణం ప్రకారం, రైతు సొమ్మును పొందుతాడు. పట్టదార్ పాస్ పుస్తకములతో పాటు చెక్కులను ముద్రించి, రైతులకు పంపిణీ చేశారు. ఖాతాలో భద్రపరచకుండా తక్షణమే నియమిత బ్యాంకు యొక్క ఏదయినా బ్రాంచి లో డిపాజిట్ చేయడం ద్వారా సొమ్ము మొత్తం రైతు నేరుగా చెల్లించబడటం ఈ పధకం యొక్క ప్రత్యేకత.